Saturday, November 23, 2024
HomeTrending Newsఆర్య సమాజ్‌ వివాహాలపై సుప్రీం కీలక తీర్పు

ఆర్య సమాజ్‌ వివాహాలపై సుప్రీం కీలక తీర్పు

ఆర్య సమాజ్‌లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇకపై ఆర్య సమాజ్‌ ఇచ్చే పెళ్లి ధ్రువపత్రాలు చెల్లవని తేల్చి చెప్పింది. వివాహ ధ్రువీకరణ పత్రాలివ్వడం ఆర్యసమాజ్‌ పనికాదని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆర్య సమాజ్‌ పెళ్లిళ్ల సర్టిఫికెట్లను గుర్తించబోమని పేర్కొంది.

మధ్యప్రదేశ్ లో ఓ ప్రేమ పెళ్లి విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తమ కుమార్తెను యువకుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. అమ్మాయి ఇష్టంతో పెళ్లి జర్గినట్టు, ఆర్య సమాజ్ పెళ్లి సర్టిఫికేట్ ను యువకుడు కోర్టుకు సమర్పించగా న్యాయమూర్తులు తిరస్కరించారు. పెళ్లిళ్లు చేయడం ఆర్యసమాజ్‌ పనికాదని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, నాగరత్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

సనాతన హిందూ ధర్మంలో సంస్కరణల కోసం 1875 లో ఆర్య సమాజ్ ను దయానంద సరస్వతి స్థాపించారు. వేదాలు ప్రమాణికంగా తీసుకోవాలని.. కులాచారాలను ఆర్య సమాజ్ వ్యతిరేకిస్తుంది. Go back to vedas నినాదమే స్పూర్తిగా పౌర హక్కుల కోసం, కుల నిర్మూలనలో భాగంగా కులాంతర, మతాంతర వివాహాలకు ఆర్య సమాజ్ దశాబ్దాలుగా వేదికైంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్