One sided: శ్రీలంకతో జరిగిన తొలి టి 20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. కెప్టెన్ ఆరోన్ పించ్ -61; డేవిడ్ వార్నర్-70 పరుగులతో అజేయంగా నిలిచి వికెట్ నష్టపోకుండా ఆతిథ్య లంకను ఓడించారు.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లంక తొలి వికెట్ కు 39 పరుగులు చేసింది. గుణ తిలక 26పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత మరో ఓపెనర్ పాతుమ్ నిశాంక-అసలంక లు రెండో వికెట్ కు 61 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. 31 బంతుల్లో 36 పరుగులు చేసిన నిశాంక అవుట్ కావడంతో లంక వికెట్ల పతనం మొదలైంది. అసలంక 38 స్కోరు చేసి రనౌట్ కాగా, ఆ తర్వాత హసరంగ ఒక్కడే 17 పరుగులతో రాణించాడు. ఇద్దరు డకౌట్ కాగా, నలుగురు కేవలం తలా ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యారు. దీనితో 19.3 ఓవర్లలో 128 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో హాజెల్ వుడ్ నాలుగు, స్టార్క్ మూడు, కేన్ రిచర్డ్సన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ లో పించ్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్సర్లతో 61; డేవిడ్ వార్నర్ 44బంతుల్లో 9ఫోర్లతో 70 పరుగులతో అజేయంగా నిలిచి 14 ఓవర్లలోనే విజయం అందించారు.
నాలుగు వికెట్లు తీసిన హాజెల్ వుడ్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.