Crop Insurance: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని నేడు (14.06.2022) శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్ధిక భారం లేకుండా, రైతుల తరపున పూర్తి ప్రీమియం బాధ్యతను కూడా జగన్ ప్రభుత్వమే తీసుకుని, సాగుచేసిన ప్రతి ఎకరాన్ని ఈ–క్రాప్‌లో గ్రామంలోనే ఆర్‌బీకేల ద్వారా నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తూ…బీమా పరిహారపు సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా ఒక సీజన్‌ది మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తోంది,
గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా రైతన్నలకు ఈ మూడేళ్ళలో ఒక లక్షా 28 వేల 171 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందించింది.
Also Read : వ్యవసాయ యంత్రాలకు నేడు సిఎం శ్రీకారం