After Rana…: పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం‘. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
డైరెక్టర్ వేణు గారు ఈ కథ చెప్పినప్పుడు ఆ లోకం కొత్తగా అనిపించింది. నాటి పరిస్థితులు గురించి తెలుసుకుంటున్నపుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళుతున్న భావన కలిగింది. ఇప్పుడు అందరికీ స్వేఛ్చ వుంది. ఇప్పుడు ఒక కార్ బ్యాక్ ఫైర్ కావడం సామాన్యమైన విషయంగా చూస్తున్నా ము. కానీ అప్పుడు ఒక శబ్దం వచ్చినా ఏదైనా పేలుడు జరిగిందా అనే కంగారులో చూసేవారు. నాటి పరిస్థితులు, సమయం గురించి దర్శకుడు వేణు గారు చాలా విషయాలు నేర్పారు.
వెన్నెల పాత్రలో రా నెస్ వుంది. ఇసుకతో బొమ్మ తయారు చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఆయుధంగా కూడా మలుచుకోవచ్చు. వెన్నెల పాత్ర కూడా అలానే అనిపించింది. వెన్నెల ఒక తెల్లకాగితం. దాని పై ఏది రాస్తే అదే ఆమె అవుతుంది. దర్శకుడు ఆ పాత్రని చాలా నిజాయితీగా రాశారు. దర్శకుడు వేణు గారు మొదట నిర్మాతలు సుధాకర్ గారు, శ్రీకాంత్ గారితో తర్వాత నాతో మాట్లాడారు. ఈ స్క్రిప్ట్ సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రానా గారు రవన్న పాత్ర చేస్తారని తెలిసింది. చాలా ఆనందంగా అనిపించింది. రానా గారి స్టార్ డమ్, స్థాయి, ఆయనకి వున్న వాయిస్ కి రవన్న పాత్ర ఆయనకి గొప్పగా నప్పుతుందనిపించింది. రానా గారు వచ్చిన తర్వాత విరాట పర్వం స్కేల్ మారిపోయింది. రానా గారు ఈ ప్రాజెక్ట్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.
ప్రియమణి, నందితా దాస్ నటనతో ప్రేరణ పొందుతాను. విరాట పర్వంలో వారితో నటించినపుడు ఎలాంటి ఒత్తిడి తీసుకోలేదు. కానీ ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఫ్రేం లో వారితో నేను వున్నానా అనే ఫీలింగ్ కలిగింది. ఇది మంచి అనుభూతి. సెట్, ఐరన్ బట్టలు, ఇంటిని ఆర్ట్ డైరెక్టర్ డిజైన్ చేయడం.. ఇవన్నీ చూసి మన ఇల్లు ఇలా వుండదు కదా అని కొన్నిసార్లు డిస్ కనెక్ట్ అవ్వొచ్చు. కానీ విరాట పర్వంలో ఇలాంటి ఊరు, మనుషులు నిజంగానే వుంటారు. మన ఊర్లో అమ్మాయిలు అలానే కూర్చుంటారు, అలానే మాట్లాడుతారు. అదే ఒక రా ఫీలింగ్ ఇచ్చాయి. నేను కొన్ని సినిమాల్లో ఐ లైనర్ వేసుకుంటాను. కానీ విరాట పర్వంలో కేవలం మొహం కడుక్కుని చేశాను. ఇంత స్వేఛ్చగా మన భావాలను వ్యక్తపరచడం ఆనందాన్ని ఇచ్చింది.
నన్ను తెలంగాణ ఆడపడుచు అంటున్నారు. దర్శకుడు వేణు గారు కూడా అదే అన్నారు. బహుశా గత జన్మలో ఇక్కడే పుట్టుంటానేమో (నవ్వుతూ). విరాట పర్వం విడుదల ఆలస్యం అయ్యింది అనుకుంటున్నారు కానీ..విరాట పర్వం విడుదలకు ఇదే సరైన సమయం. ఇప్పుడు ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ కి వస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలు చూస్తున్నారు. విరాట పర్వం కూడా వారికి తప్పకుండా నచ్చుతుంది. చాలా నిజాయితీ గల సినిమా ఇది. పాండమిక్ కి ముందు లవ్ స్టొరీ, విరాటపర్వం చేశాను. తర్వాత శ్యామ్ సింగ రాయ్ వచ్చింది. అయితే నేను గ్యాప్ గురించి ఎక్కువ అలోచించను. నేను కళని ఎక్కవగా నమ్ముతాను. నా కోసం ఒక కథ వుంటే అది తప్పకుండా నన్ను వెదుక్కుంటూ వచ్చేస్తుంది.తెలుగులో కథలు చదువుతున్న. శివకార్తికేయన్ గారితో తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశాను.
Also Read : ‘విరాటపర్వం’కథ సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుందట!