Salman-Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ పాన్ ఇండియా మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో చరణ్ కు నేషనల్ వైడ్ మంచి క్రేజ్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే భారీ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు చరణ్. ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ మూవీ 2023 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తర్వాత చరణ్.. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీ. ఇదిలా ఉంటే.. చరణ్.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ మూవీలో గెస్ట్ రోల్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమాలో అంటే.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కలిసి కబీ ఈద్ కబీ దివాళి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ భారీ చిత్రంలో చరణ్ ఒక సాంగ్ లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ఈ వార్తలు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ న్యూస్. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, యోయో హనీ సింగ్ సంగీతం అందిస్తున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే చరణ్ ఈ మూవీలో నటిస్తున్నాడా..? లేదా..? అనేది తెలియాల్సివుంది.
Also Read : మళ్లీ వార్తల్లో నిలిచిన చరణ్, శంకర్ మూవీ టైటిల్