Saturday, November 23, 2024
HomeTrending Newsఅపాచీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సిఎం

అపాచీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సిఎం

Foundation done: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.  దీనిలో ఆడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్,  బెల్టులు లాంటి ఉత్పత్తులను తయారు చేయనుంది.  మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా మొత్తం పదివేల మందికి ఉపాధి  లభించనుంది.  రెండేళ్లలో మొదటి దశ ఉత్పత్తులు మార్కెట్ లోకి రానున్నాయి.

సిఎం జగన్ సమక్షంలో హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా(అపాచీ గ్రూప్)కి భూ కేటాయింపుల పత్రాన్ని ఆ సంస్థ సీఈవో టోనీకి  ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది అందజేశారు.  ఎకరాకి రూ. 6,50,000 చొప్పున 298 ఎకరాల అన్ డెవలప్డ్ ల్యాండ్ కి సంబంధించి ల్యాండ్ అలాట్ మెంట్ లెటర్ కూడా అందించారు.  మహిళలకే 80 శాతం ఉద్యోగాలతో ఈ యూనిట్ ద్వారా 10వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  ముఖ్యమంత్రి సహకారం, పరిశ్రమల మంత్రి చొరవ, పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ ఉన్నతాధికారులకు అపాచీ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, విద్యుత్ , అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంఎల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి, ఎడ్యుకేషన్ కమ్యూనిటీ, డెవలప్మెంట్ ఛైర్మన్ నేదురుమల్లి రామ్ , ఏపీఐఐసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ (వెంకటగిరి) ఆవుల సుకన్య, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా (అపాచీ) సీఈవో టోనీ, వైస్ ప్రెసిడెంట్ సెర్గియో లీ, ఇతర ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్