Saturday, November 23, 2024
Homeసినిమాఅన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో `అరి`: లోగో ఆవిష్క‌రణ

అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో `అరి`: లోగో ఆవిష్క‌రణ

Ari-Anu:  త‌న మొద‌టి మూవీ`పేప‌ర్ బాయ్‌`తో హార్ట్ ట‌చింగ్ హిట్ కొట్టిన జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో , ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు శేషు మారం రెడ్డి, శ్రీ‌నివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణలో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, సాయికుమార్‌, వైవాహ‌ర్ష‌, శుభ‌లేఖ సుధాక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో విడుద‌ల‌యింది. శుక్ర‌వారంనాడు గ‌చ్చిబౌలిలో రాడిస‌న్ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో హుజూరాబాద్ ఎం.ఎల్.ఎ. శానంపూడి సైదిరెడ్డి, అఖండ నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి సంయుక్తంగా లోగో ఆవిష్క‌రించారు.

మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ… ఆర్‌.వి. సినిమాస్ `అరి`. నో బ‌డీ నోస్‌.. అనే టైటిల్ చాలా వెరైటీగా వుంది. పోస్ట‌ర్‌లో లైబ్ర‌రీతోపాటు కొన్ని వున్నాయి. ఇవి చూస్తుంటే ఇంటిలిజెంట్ మూవీలా అనిపిస్తుంది. నిజాయితీగా ప‌నిచేస్తే ఈ రంగంలో స‌క్సెస్ వ‌స్తుంది. రావ‌డంలేటయినా రావ‌డం ప‌క్కా. ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ పేప‌ర్ బాయ్ సినిమాను చాలా అందమైన ప్రేమ‌క‌థ‌గా చూపించాడు.ఈ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ రావాల‌ని కోరుకుంటున్నాను. అనూప్ రూబెన్స్ అన‌గానే మ‌నం, ఇష్క్ చిత్రాలు గుర్తుకు వ‌స్తాయి.
అన‌సూయ న‌టిగానే కాదు. సోష‌ల్ ఎవేర్‌నెస్‌కూడా ఆమెలో క‌నిపిస్తుంది. రంగ‌మ్మ‌త్త‌కు ముందు ఆ త‌ర్వాత అన్న‌ట్లు ఆమెకు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటుంది. ఈ సినిమా ప‌నిచేసిన‌వారంతా త‌ప‌న‌తో చేసిన‌ట్లు క‌నిపిస్తున్నారు. కంటెంట్‌ను న‌మ్ముకుని చేసిన‌ట్లుంది. ఇలాంటి వారికి స‌క్సెస్ రావాల‌ని ఆశిస్తున్నాను అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ… నిర్మాత‌కు క‌థ‌ను వెంట‌నే చెప్పి ఒ ప్పించ‌గ‌లిగాను. కానీ `అరి` అనే టైటిల్‌ను చెప్ప‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాను. `అరి` అనేది సంస్కృత‌ప‌దం. శ‌త్రువు అని అర్థం. అది ఏమిటి? అనేది సినిమాలో చెప్పాను. ఈరోజే టైటిల్‌లోగో విడుద‌ల‌చేశాం. మ‌రిన్ని ఫంక్ష‌న్లు వుంటాయి. అప్పుడు సినిమా గురించి మ‌రింత‌గా వివ‌రిస్తాను. కె.వి.రెడ్డిగారు ఓ సంద‌ర్భంలో, సినిమా తీయ‌డ‌మంటే 100 పెండ్లిల్ల‌తో స‌మానం అన్నారు. కానీ కోవిడ్ వ‌ల్ల సినిమా తీయ‌డం వెయ్యి పెండ్లిండ్ల‌తో స‌మానం అని నాకు అనిపిస్తుంది. ఈ సినిమాను 2020లో క‌రోనా టైంలో చాలా స్ట్ర‌గుల్ పేస్ చేసి తీశాం. అన‌సూయ‌గారు క‌థ చెప్ప‌గానే అంగీక‌రించారు. సాయికుమార్‌, శుభలేఖ సుధాక‌ర్‌.. ఇలా అంద‌రూ ముందుకువ‌చ్చారు. అనూప్‌గారికి క‌థ చెప్ప‌గానే వెంట‌నే చేస్తున్నా అన్నారు. మూడు మంచి ట్యూన్స్ ఇచ్చారు. పేప‌ర్‌బాయ్ కంటే ఈ సినిమాకు మంరిత పేరు వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్