Sunday, January 19, 2025
HomeTrending Newsరాజ్య సభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్

రాజ్య సభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్

Upper House:  సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.  తెలుగు రాష్ట్రాల నుంచి జగద్విఖ్యాత దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తండ్రి, ప్రఖ్యాత రచయిత, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు కథను అందించిన ఎస్. విజయేంద్ర ప్రసాద్ ను కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు.  వీరిద్దరితోపాటు పరుగుల రాణి పిటి ఉష, ధర్మస్థలం దేవాలయ ధర్మాధికారి వీరేంద్ర  హెగ్డే లను కూడా నామినేట్ చేశారు.  ఈ నలుగురూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని స్వయంగా తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరి నామినేషన్ పై ఒక్కో ట్వీట్ ను మోడీ షేర్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్