Friday, April 18, 2025
Homeస్పోర్ట్స్Rafael Nadal: గాయంతో నాదల్ ఔట్

Rafael Nadal: గాయంతో నాదల్ ఔట్

రాఫెల్ నాదల్ పొత్తికడుపులో కండరం గాయం కారణంగా వింబుల్డన్ నుంచి వైదొలిగాడు. మొన్న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లోనే ఈ గాయంతో ఇబ్బందిపడ్డ నాదల్ తేరుకొని ఆడి హోరాహోరీ పోరులో విజయం సాధించాడు. అదేరోజు నాదల్ తన తదుపరి మ్యాచ్ పై సందేహం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు గత అర్ధరాత్రి నాదల్ ప్రకటించాడు.

నేడు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా కు చెందిన  కిర్గియోస్ తో నాదల్ తలపడాల్సి ఉంది.  మరో మ్యాచ్ లో సెర్బియా స్టార్ జకోవిచ్- ఇంగ్లాండ్ ప్లేయర్ కామెరూన్ నోరీ ల మధ్య జరిగే పోరులో విజేతతో కిర్గియోస్ ఫైనల్లో ఆడనున్నాడు.  పరిస్థితులు అనుకూలిస్తే రఫెల్ నాదల్- జకోవిచ్ మధ్య ఫైనల్ పోరు చూడాలనుకున్న లక్షలాది టెన్నిస్ అభిమానుల ఆశలు నెరవేరలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్