జపాన్ మాజీ ప్రధాని షింజో అబే పై కాల్పులు జరిగాయి. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగంతకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మాజీ ప్రధానికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. షింజో అబే చనిపోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అబే మృతిపై భారత్, అమెరికా, రష్యా తదితర దేశాలు సంతాపం ప్రకటించాయి.
లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ తరపున నారా నగరంలోని ప్రచారం నిర్వహిస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. జపాన్ ప్రధానిగా సుధీర్గ కాలం సేవలు అందించిన షింజో అబే 2020లో అనారోగ్య కారణాల రిత్యా పదవి నుంచి వైదొలిగారు. భారత దేశానికి మంచి మిత్రుడుగా ఉండే షింజో అబే పై కాల్పులు జరగటం దురదృష్టకరమని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది.