అమర్ నాథ్ లో కుంభవృష్టి విషాదాన్ని నింపింది. లోయలో రెండు కిలోమీటర్ల మేర వరద బీభత్సం సృష్టించగా భోలేనాథ్ గుహకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో వైపు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన వరదల నుంచి తృటిలో తప్పించుకున్నారు. వరద ముంచెత్తిన సమయంలో రాజాసింగ్ సమీపంలోనే ఉన్నట్లు తెలిసింది. దుర్ఘటన జరగిన ప్రాంతం నుంచి బయటకు వచ్చిన పది నిమిషాల్లోనే వరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు.
అమర్‌నాథ్‌లో మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు రాజా సింగ్ తెలిపారు. గత 3 రోజులుగా అమర్‌నాథ్ మార్గంలో వర్షాలు ఏకధాటిగా పడుతున్నాయని తెలిపారు. హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం కావాలని భావించామని కానీ, అననుకూల వాతావరణం నేపథ్యంలో గుర్రాలపై తిరుగు ప్రయాణం అయినట్టు వెల్లడించారు. ఇక, వరదలపై ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా వరద వచ్చింది, నా కళ్ల ముందే చాలా మంది కొట్టుకుపోయారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : అమర్‌నాథ్ లో కుంభవృష్టి..17కు చేరిన మృతుల సంఖ్య