Sunday, November 24, 2024
Homeసినిమాయంగ్ హీరో ఎంతమాత్రం తగ్గడం లేదే!

యంగ్ హీరో ఎంతమాత్రం తగ్గడం లేదే!

Taggede-le: ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై యంగ్ హీరోల జోరు కొనసాగుతోంది. కొత్త దర్శకుల సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. అంతా కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ప్రయోగాలు చేస్తున్నవారూ ఉన్నారు. కథ అనుకున్న దగ్గర నుంచే యంగ్ హీరోలు దర్శకులతో కలిసి ట్రావెల్ అవుతూ, దర్శకుడికి తమ వైపు నుంచి కావలసిన సపోర్టును ఇస్తున్నారు. ఆడియన్స్ కూడా కంటెంట్ గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. హీరో నేపథ్యం .. అతని క్రేజ్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో యంగ్ హీరోలు తమని తాము నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు కూడా చిన్న హీరోలతో చిన్న సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాయి.  గీతా ఆర్ట్స్  2 ..  యూవీ .. మైత్రీ .. ఇలా కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు చిన్న సినిమాలపై కూడా ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నాయి. కొత్తగా వచ్చిన హీరోలను .. దర్శకులను ప్రోత్సహిస్తున్నాయి. దాంతో కిరణ్ అబ్బవరం వంటి హీరోలు నిలదొక్కుకోవడానికి సమయం దొరుకుతోంది. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కిరణ్, ఆ తరువాత నుంచి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

ఈ మధ్య వచ్చిన అతని  సినిమాలు ‘సెబాస్టియన్’ .. ‘సమ్మతమే’ అంతగా ఆడలేదు. అయినా గీతా ఆర్ట్స్ వారు అతనితో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చేస్తున్నారు. టైటిల్ అయితే జనానికి బాగానే కనెక్ట్ అయింది. ఈ సినిమాతో కశ్మీర కథానాయికగా పరిచయమవుతోంది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. నిజంగా కిరణ్ కి ఇది ఒక మంచి అవకాశం. ఇంతవరకూ అతను చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ  సినిమా ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ కొడితే, మరికొన్ని హిట్లు పడేవరకూ నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న హీరోలకు ప్రతి సినిమా ఒక పరీక్షనే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్