Saturday, November 23, 2024
HomeTrending Newsఅజ్మీర్ దర్గా ఖాదీమ్.. గౌహర్ చిస్తీ అరెస్ట్

అజ్మీర్ దర్గా ఖాదీమ్.. గౌహర్ చిస్తీ అరెస్ట్

జూన్ 17న దర్గా వెలుపల ‘సర్ తాన్ సే జుడా’ నినాదం చేసిన అజ్మీర్ దర్గా ఖాదీమ్ సయ్యద్ గౌహర్ చిస్తీని గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు గాను సస్పెండ్ చేయబడిన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మకు వ్యతిరేకంగా గౌహర్ చిస్తీ గత నెలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేపథ్యంలో అజ్మీర్ పోలీసులు గౌహర్ చిస్టీపై సుమో-మోటో కేసు నమోదు చేసి అతని కోసం వేట ప్రారంభించారు.

హైదరాబాద్ లో గురువారం ఉదయం బేగంబజార్ ప్రాంతంలో చిస్తీ ఉన్నారనే సమాచారం అందింది. దీంతో రాజస్థాన్‌కు చెందిన అజ్మీర్ పోలీసుల బృందం అతన్ని అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై అజ్మీర్‌కు తరలించారు. ఇటీవల అజ్మీర్ దర్గాకు చెందిన మరో మతపెద్ద సల్మాన్ చిస్తీ ప్రవక్త మొహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్య చేసినందుకు నూపుర్ శర్మ తలపై బహుమానం ప్రకటించారు. అత‌న్ని కూడా అరెస్టు చేశారు.

నుపుర్ శర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ చిస్తీని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్ చిస్తీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైన విషయం విధితమే. నుపుర్ శర్మ తల నరికితెస్తే ఇల్లు గిఫ్ట్ ఇస్తానని సల్మాన్ చిస్తీ పేర్కొన్నాడు. సల్మాన్ చిస్తీ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

అజ్మీర్ దర్గాకు చెందిన ముగ్గురు ఖాదీం లో ఇప్పటివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నుపూర్ శర్మ వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడినట్టు కనిపించినా వారు పరమత సహనం కోల్పోయి వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. మొదట సల్మాన్ చిస్తీ, ఆ తర్వాత సయ్యద్ గౌహర్ చిస్తీ, తాజాగా ఆదిల్ చిస్తీ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉన్నాయి. హిందువుల ౩౩ కోట్ల మంది దేవుళ్ళా.. సగం జంతువులూ కూడా హిందూ దేవుల్లెనా అంటూ నుపూర్ శర్మ వ్యాఖ్యలను జోడిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో జూన్ 23 వ తేదిన నెట్లో వైరల్ అయ్యింది. దీనిపై హిందూ సంస్థలు నిరసనగా దిగటంతో తానూ ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని, బాధించి ఉంటే క్షమించాలని ఆదిల్ చిస్తీ మరో వీడియో విడుదల చేశారు.

అనంతర పరిణామాలు ఉదయ్‌పూర్ హత్య కేసు జూన్ 28న ఇద్దరు ముస్లింలు టైలర్ కన్హయ్య లాల్ తేలీని దారుణంగా హతమార్చడంతో రాజస్థాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. నుపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు తెలీ హత్యకు గురయ్యాడు. టైలర్‌పై రియాజ్ అఖ్తరీ దాడి చేయగా, అతని సహచరుడు గౌస్ మహ్మద్ ఈ హత్యను ఫోన్‌లో రికార్డ్ చేసి వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.

Also Read : నుపూర్ శర్మకు సుప్రీంకోర్టు మందలింపు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్