జీఎస్టీ రేట్ల పెంపును నిరసిస్తూ ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపిలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టినద ఈ ఆందోళనలో టిఆర్ఎస్ పార్టీ కూడా పలుపంచుకుంది. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు నేతృత్వంలో టిఆర్ఎస్ ఎంపీల నిరసన చేపట్టారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు గళం విప్పాయి. నిరసన ప్రదర్శనలో పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార ఉత్పత్తులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గ్యాస్ ధరల పెంపు పై ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేసిన విపక్ష పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని డిమాండ్ చేశారు.