Saturday, November 23, 2024
HomeTrending Newsబ్రిటన్‌ ప్రధాని పదవికి అడుగు దూరంలో రిషి సునాక్

బ్రిటన్‌ ప్రధాని పదవికి అడుగు దూరంలో రిషి సునాక్

Rishi Sunak Leading : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునాక్ చరిత్రకు అడుగుదూరంలో నిలిచారు.  బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ఆయన  కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల బ్యాలెట్‌ పోల్‌లో వరుసగా ఐదు రౌండ్‌లోనూ  ముందంజలో నిలిచారు. ఐదో రౌండ్లో సునక్‌ 137 ఓట్లతో అగ్రస్థానంలో నిలవగా, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ 113 ఓట్లు సాధించారు. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ 105 ఓట్లతో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆఖరి రౌండ్‌లో సునక్, లిజ్ ట్రస్‌ల మధ్య పోటీ జరుగనుంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే రిషి బ్రిటన్‌ ప్రధాని పదవికి మరో అడుగుదూరంలో ఉన్నాడని చెప్పవచ్చు. ఫైనల్‌ రౌండ్‌లో సుమారు 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. వీరు ఈ ఇద్దరు అభ్యర్థులలో ఒకరిని ప్రధాని పదవికి ఎంపిక చేసేందుకు ఓటు వేస్తారు. సెప్టెంబర్‌ 5న ప్రధానిని ప్రకటించనున్నారు.

ఐదు, నాలుగు రౌండ్లలో వరుసగా 133, 118 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచాడు రిషి. మూడో రౌండ్ ఓటింగ్‌లో మాజీ ఆర్థిక మంత్రి సునక్‌కు 115 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో రెండో రౌండ్‌లో 101 ఓట్లు రాగా, తొలి రౌండ్‌లో 88 ఓట్లు వచ్చాయి. ఇలా అన్ని దశల్లోనూ అగ్రస్థానంలో నిలిచి అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రధాని పదవికి అడుగుదూరంలో నిలిచాడు సునక్‌. అయితే రిషి సునాక్ కు ప్రధాని పదవి పై కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో బేధాభిప్రాయాలు ఉన్నాయని వినిపిస్తోంది. భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని పదవి చేపడితే ఆంగ్లేయుల మనోబావాలు దెబ్బతింటాయనే వార్త కన్జర్వేటివ్ పార్టీలో చక్కర్లు కొడుతోంది. లిజ్ ట్రస్ అంగ్లేయురాలు కావటంతో పార్టీ శ్రేణులు ఆమె వైపే మొగ్గు చూపవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాత్యహంకారం అధికంగా కలిగిన ఆంగ్లేయులు తుదికంటా ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

బోరిస్ రాజీనామాతో..

బ్రిట‌న్‌లో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న నేప‌థ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అపద్ధర్మ ప్రధానిగా బోరిస్ కొనసాగుతున్నారు. తన సన్నిహితుడు మాజీ ఎంపీ క్రిస్ పించర్ సెక్స్ స్కాండల్, పార్టీ గేట్ కుంభకోణంతో విమర్శల పాలైన బోరిస్ జాన్సన్ స్థానంలో వేరొకరిని కూర్చోబెట్టడానికి సిద్ధపడ్డ కన్సర్వేటివ్‌లు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నుకోవడానికి ప్రక్రియను ఆ పార్టీ ఎంపీలు ప్రారంభించారు. ఈ పోటీలో నిలిచిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ గా నిలిచిన వ్యక్తే ప్రధానిగా ఎన్నికవుతారు. జులై 20 నాటికి ముగిసిన ఐదు రౌండ్లలో రిషి సునాక్ టాప్ లో కొనసాగుతున్నారు. చివరి రౌండ్లో నిలిచిన ఇద్దరి నుంచి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను టోరీలను పిలుస్తుంటారు. కన్జర్వేటివ్ పార్టీ టోరీస్ పార్టీ నుంచి ఆవిర్భవించింది. ఈ పార్టీ సభ్యులకు మరోపేరు టోరీస్.

Also Read : నాలుగో రౌండ్ లోను రిషి సునాక్ ఆధిక్యం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్