Wednesday, November 27, 2024
Homeస్పోర్ట్స్మానసికంగా వేధిస్తున్నారు: లవ్లీనా

మానసికంగా వేధిస్తున్నారు: లవ్లీనా

మరో మూడు రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న దశలో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధికారుల తీరుపై బాక్సర్ లవ్లీనా బోర్గోహేయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పెద్ద పోస్ట్ పెట్టింది. ఆమె వ్యక్తిగత కోచ్ లను కామన్ వెల్త్ గేమ్స్ కు అనుమతించకపోవడమే దీనికి కారణం.

లవ్లీనా టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఘనతకు కారణమమైన ఆమె కోచ్ సంధ్య గురుంగ్ ను అక్రిడేషన్ లేని కారణంగా గేమ్స్ విలేజ్ లోకి రానివ్వలేదు.  మరో కోచ్ ఆమే కోలేకర్ కు అసలు బర్మింగ్ హామ్ వెళ్ళే జాబితాలోనే చోటు దక్కలేదు, దీనిపై ఆమె తీవ్ర అసహనం వెలిబుచ్చింది.

“ నా కోచ్ సంధ్య జీ కామన్ వెల్త్ విలేజ్ బైట అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు, ఆమె ద్రోణాచార్య అవార్డు గ్రహీత కూడా, ఆమెకు ఇదేనా ఇచ్చే గౌరవం, మరో వారంరోజుల్లో తన ఈవెంట్ లో సత్తా చాతాల్సిన తరుణంలో ఇలాంటి చర్యను తనను వేధిస్తున్నాయి’ అంటూ వాపోయింది.  ఇటీవలే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో కూడా ఇలాంటి కారణాలతోనే ఏకాగ్రత కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తన మరో కోచ్ ను బర్మింగ్ హామ్ నుంచి ఇండియాకు వెనక్కు పంపారని పేర్కొంది.

ఇలాంటి రాజకీయాలతో మెగా ఈవెంట్ లో మెడల్ గెల్చుకొనే అవకాశాన్ని దెబ్బ తీయవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు లవ్లీనా విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్