దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందిన చిత్రం సీతారామం. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మ సుమంత్ మరో కీలక పాత్ర పోహిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘సీతారామం’ థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, రమేష్ ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు.
థియేట్రికల్ ట్రైలర్ ఎపిక్ లవ్ స్టొరీలోని కీలకమైన ఘట్టాలని ఆసక్తికరంగా ఆవిష్కరించింది.“ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్‌నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి’ అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రామ్ ఒక ఒక అనాథ. కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గా భాద్యతలు నిర్వహిస్తుంటాడు. సీత అనే అమ్మాయి నుండి వచ్చిన ఉత్తరం రామ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రామ్, సీతను కలుస్తాడు. వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. రామ్ కాశ్మీర్ లోని తన క్యాంపు కి తిరిగి వచ్చినప్పుడు సీతకు ఒక లేఖ రాస్తాడు. కానీ అది ఆమెకు చేరలేదు.
20 ఏళ్ల తర్వాత సీతకు ఆ లేఖ ఇచ్చే భాధ్యత రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్ ల పై పడుతుంది. సీత అన్వేషణ లో విఫలమైన వారు.. రామ్ కోసం అన్వేషణ మొదలుపెడతారు. కానీ రామ్ ని పట్టుకోవడం సీతని అన్వేషించడం కంటే కష్టమౌతుంది. దీనికి కారణం రామ్ బాస్ బ్రిగేడియర్ విష్ణు శర్మ (సుమంత్). ట్రైలర్ లో ఆవిష్కరించిన ఈ సన్నివేశాలు సినిమా పై మరింత క్యురీయాసిటీని పెంచాయి.
1965, 80 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతంగా సాగింది. అత్యున్నత నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ చిత్రం చిరకాలం నిలిచిపోయే చిత్రంగా అవుతుంది అని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇందులో వారి కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. రష్మిక మందన్న హీరోయిక్ రోల్, సుమంత్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా వుంది.