పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారంతో మంత్రి సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల అంతటా కలియ తిరిగి విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మంత్రి దగ్గరుండి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు.
మరోవైపు కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ Bsc నర్సింగ్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్ధినీలకు కరోన పాజిటివ్ గా తేలింది. వసతి గృహం ప్రత్యేక గదుల్లో హోమ్ క్వారెంటైన్ లో ఉన్న విద్యార్థినిలు. స్వయంగా హాస్టల్ కు వచ్చి విద్యార్థినుల క్షేమ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. కరోనా ప్రభావం అంతగా లేదు, భయపడవద్దు, మీకు అన్ని విధాలుగా నేనున్నానని తెలిపిన స్పీకర్ పోచారం. విద్యార్థినులకు శక్తిని పెంచే బలవర్ధకమైన ఆహార పదార్థాలు ఇవ్వాలని సిబ్బందికి సూచించిన స్పీకర్ అవసరమైన వారికి వైద్య సహాయం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.