Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: Weight Lifting: ఇండియాకు మరో రజతం

CWG-2022: Weight Lifting: ఇండియాకు మరో రజతం

బర్మింగ్ హామ్ లో జరుగుతోన్న కామన్ వెల్త్ క్రీడల్లో  వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియాకు మరో పతకం లభించింది. 109కిలోల విభాగంలో  మన క్రీడాకారుడు లవ్ ప్రీత్ సింగ్ కాంస్య పతకం సంపాదించాడు.

స్నాచ్ కేటగిరీలో 163; క్లీన్ అండ్ జర్క్ లో 192తో మొత్తం 355కిలోల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు.

కామెరూన్ ఆటగాడు మొదటి స్థానంలోను, సమోయ ఆటగాడు రెండో స్థానంలోనూ నిలిచారు.

ఈ విజయంతో ఇండియా పతకాల సంఖ్య 14కు చేరింది. వీటిలో ఐదు స్వర్ణం, ఐదు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లోనే తొమ్మిది పతకాలు ఉండడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్