Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్CWG-2022: Women Cricket: సెమీస్ కు ఇండియా

CWG-2022: Women Cricket: సెమీస్ కు ఇండియా

బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు సెమీ ఫైనల్లో ప్రవేశించింది.  నేడు జరిగిన మ్యాచ్ లో బార్బడోస్ పై  100 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో రోడ్రిగ్యూస్ 56 నాటౌట్; ఓపెనర్ షఫాలీ వర్మ-43; దీప్తి శర్మ-34 పరుగులతో రాణించగా, బౌలింగ్ లో రేణుకా సింగ్ నాలుగు వికెట్లతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బార్బడోస్ బౌలింగ్ ఎంచుకుంది, ఇండియా  ఏడు పరుగుల వద్ద ఓపెనర్ స్మృతి మందాన (5) వికెట్ కోల్పోయింది, రెండో వికెట్ కు షఫాలీ- రోడ్రిగ్యూస్  71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ హర్మన్ డకౌట్ కాగా, తానియా భాటియా కేవలం 6 పరుగులే చేసింది. ఆ తర్వాత వచ్చిన దీప్తి రోడ్రిగ్యూస్ తో కలిసి మరో వికెట్ పడకుండా నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 162 స్కోరు చేయగలిగింది.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బార్బడోస్ లో కైసోనా నైట్-16; షకేరా సేల్మాన్-10 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. దీనితో 20 ఓవర్లకు 8వికెట్లు కోల్పోయి 62పరుగులే చేయగలిగింది.

ఇండియన్ బౌలర్లలో రేణుక-4; మేఘన సింగ్, స్నేహ్ రానా, రాధా యాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా ఒక వికెట్ సాధించారు.

Also Read : పాక్ పై ఇండియా ఘన విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్