కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఈ రోజు ఢిల్లీ లో కలిశారు. దీనిపై ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరిగింది. భువనగిరి నియోజకవర్గంతో పాటు తెలంగాణలో వరద సాయం కోసమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశానని వెంకట్ రెడ్డి ఆ తర్వాత వివరణ ఇచ్చారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. ప్రధానమంత్రి ని కూడా అపాయింట్మెంట్ కోరినట్టు ఎంపి వెల్లడించారు. సిఎం కెసిఆర్ దగ్గర ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే డబ్బులు లేవు..ఇక వరద బాధితులను ఏం ఆదుకుంటారని ఎంపి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
అయితే కోమటి రెడ్డి సోదరులు ఇద్దరు ఒకరి తర్వాత మరొకరు కేంద్ర హోం మంత్రిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ్ముడు రాజగోపల్ రెడ్డి దారిలోనే వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేత్యటం…ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవటంపై ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జిల్లా నేతలకే తెలియకుండా ఇతర పార్టీల నేతలను ఎలా చేర్చుకున్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్నా చెరుకు సుధాకర్ చేరికపై సమాచారం ఇవ్వక పోవటం…పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
Also Read : 8న రాజగోపాల్ రెడ్డి రాజీనామా