Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: Wrestling:  దీపక్ పునియాకు స్వర్ణం

CWG-2022: Wrestling:  దీపక్ పునియాకు స్వర్ణం

కామన్ వెల్త్ గేమ్స్, రెజ్లింగ్ లో ఇండియా ఒకేరోజు మూడు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ తో మొత్తం ఆరు పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. పురుషుల ఫ్రీ స్టైల్ 86 కిలోల విభాగంలో దీపక్ పునియా విజేతగా నిలిచాడు. ఫైనల్ లో పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్  ఐనామ్ పై3-0 తో విజయం సాధించాడు.

మరోవైపు దివ్య కక్రాన్ మహిళల 68 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో కాంస్యం గెలిచింది. టాంగా దేశానికి చెందిన లిలీ కాకర్ పై 2-0తో ముందంజలో నిలిచింది.

మోహిత్ గ్రేవాల్ పురుషుల ఫ్రీ స్టైల్ 125 కిలోల విభాగంలో కాంస్యం సాధించాడు. జమైకా ఆటగాడు ఆరోన్ జాన్సన్ పై 5-0 తేడాతో గెలుపొంది పతకం ఖాయం చేసుకున్నాడు.

అంతకుముందు భజ్ రాంగ్ పునియా, సాక్షి మాలిక్ స్వర్ణం గెల్చుకోగా, అన్షు మాలిక్ రజతం గెల్చుకుని విజేతలుగా నిలిచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్