Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్CWG-2022: Women Cricket: ఫైనల్లో ఇండియా

CWG-2022: Women Cricket: ఫైనల్లో ఇండియా

భారత మహిళా క్రికెట్ జట్టు కామన్ వెల్త్ గేమ్స్ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 4 పరుగులతో విజయం సాధించింది.  బ్యాటింగ్ లో భారత బ్యాట్స్ విమెన్ స్మృతి మందానా-రోడ్రిగ్యూస్ రాణించగా, ఆ తర్వాత భారత ఫీల్డర్లు చురుగ్గా కదిలి ముగ్గురు ఇంగ్లాండ్ బ్యాట్స్ విమెన్ ను రనౌట్ చేయడంతో విజయం దక్కింది.

బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు స్మృతి మందానా-షఫాలీ వర్మ 76 పరుగులు చేశారు. షఫాలీ 15 చేసి  ఔట్ కాగా, ఆ వెంటనే స్మృతి మందానా 61 పరుగులు(32బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ) చేసి వెనుదిరిగింది. రోడ్రిగ్యూస్ 31 బంతుల్లో 7ఫోర్లతో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. కెప్టెన్ హర్మన్-20; దీప్తి శర్మ-22పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెయా కాంప్ 2; బ్రాంట్, స్కైవర్  చెరో వికెట్ సాధించారు.

ఆ తర్వాత ఇంగ్లాండ్ 28 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. సోఫియా డంక్లీ-19;  క్యాప్సి-13; డానియెల్ వ్యాట్-35 పరుగులు చేశారు. కెప్టెన్ స్కైవర్-ఆమీ జోన్స్ నాలుగో వికెట్ కు 54 పరుగులు జోడించారు. భారత ఫీల్డర్లు చురుగా రాణించి వీరిద్దరినీ రనౌట్ చేయగలిగారు.  స్కైవర్-41; అమీ జోన్స్-31 పరుగులు చేశారు. చివరి ఓవర్లో 14 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్నేహ్ రానా రెండు వికెట్లు, దీప్తి శర్మ ఒక వికెట్ తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్