కామన్ వెల్త్ గేమ్స్ లో తొమ్మిదో రోజు ఇండియాకు పతకాల పంట పండింది. మొదటగా ప్రియాంక గోస్వామి కి నడకలో రజతం తో మొదలైన ఈ వేట పురుషుల 67 కిలోల వెల్టర్ వెయిట్ లో సాధించిన కాంస్యంతో ముగిశాయి.
తొమ్మిదో రోజున నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, ఏడు కాంస్య పతకాలతో మొత్తం 14 పతకాలు మన క్రీడాకారులు సాధించారు.
స్వర్ణం:
- రవి కుమార్ దాహియా- రెజ్లింగ్ – పురుషుల ఫ్రీ స్టైల్57 కిలోలు
- వినేష్ పోఘట్ – రెజ్లింగ్ – మహిళల ఫ్రీ స్టైల్ – 53 కిలోలు
- నవీన్ కుమార్ – రెజ్లింగ్ – పురుషుల ఫ్రీ స్టైల్ 74 కిలోలు
- భావీనా పటేల్ – టేబుల్ టెన్నిస్ (పారా)- మహిళల సింగిల్స్ సి 3-5
రజతం
- ప్రియాంక గోస్వామి – మహిళల 10 కిలోమీటర్ల రేస్ వాక్
- పురుషుల మూడు వేల మీటర్ల స్టిపెల్ ఛేజ్ లో అవినాష్ ముకుంద్ సబ్లే రజత పతకం
- సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేష్ కుమార్ – లాన్ బౌల్స్ – పురుషులు(నలుగురు)
కాంస్యం:
- జాస్మిన్ లంబోరియా – బాక్సింగ్ – మహిళల లైట్ వెయిట్
- పూజా గేహ్లాట్ – రెజ్లింగ్ – మహిళల ఫ్రీ స్టైల్ 50 కిలోలు
- పూజా సిహాగ్ – రెజ్లింగ్ – మహిళల ఫి స్టైల్ – 76 కిలోలు
- మహమ్మద్ హుసాముద్దీన్ – బాక్సింగ్ – పురుషుల ఫెదర్ వెయిట్
- దీపక్ నెహ్రా – రెజ్లింగ్ – పురుషుల ఫ్రీ స్టైల్ 97 కిలోలు
- సోనాల్ బెన్ పటేల్ – టేబుల్ టెన్నిస్ (పారా) – మహిళల సింగిల్స్ సి 3-5
- రోహిత్ తోకాస్ – బాక్సింగ్ – పురుషుల వేల్టర్ వెయిట్
ఇండియా మొత్తం సాధించిన పతకాల సంఖ్య 40కి చేరింది. వీటిలో 13 స్వర్ణ, 11రజత, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. రెజ్లింగ్ లో 12, వెయిట్ లిఫ్టింగ్ లో 10 లభించాయి.