కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన నల్గొండ జిల్లా ఛండురు సభలో పార్టీ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా మంచిది కాదని, వెంకట్ రెడ్డిని క్షమాపణలు కోరుతూ ఈ రోజు ఉదయమ మీడియాకు వీడియో విడుదల చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, కాంగ్రెస్ అభ్యున్నతి కోసం కృషి చేసిన నేత అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎంపి వెంకటరెడ్డికి ఎలాంటి కండిషన్ లేకుండా క్షమాపణలు చెప్తున్నాని, హోమ్ గార్డు ప్రస్తావన చేసినందుకు క్షమాపణ అడుగుతున్ననని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇదివరకే తేల్చి చెప్పారు.