Sunday, November 24, 2024
HomeTrending Newsఅంబేద్కర్ ను అవమానించారు: బాబు

అంబేద్కర్ ను అవమానించారు: బాబు

విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ పేరు తీసేసి సిఎం జగన్ తనపేరు పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని ప్రశ్నించారు. దేశంలో ఈ తరహాలో అంబేద్కరును అవమానించలేదని వ్యాఖ్యానించారు. తెనాలికి చెందిన గుదిబండ గోవర్ధన్ రెడ్డి, అతని అనుచరులు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్ ప్రభుత్వంపై బాబు మండిపడ్డారు. రాష్ట్రంలో తమకు నచ్చని వాళ్లను ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారని,  ఏపీలో మనిషి ప్రాణం కోడి కంటే చులకనైపోయిందని ధ్వజమెత్తారు.

బాబు మాట్లాడిన ముఖ్యాంశాలు:

పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచింది.

డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం వైసీపీ ప్రభుత్వానిదేనని పీపీఏ స్పష్టంగా చెప్పింది.

డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం ముందుగా టీడీపీ అన్నారు.. నివేదికలు వచ్చాక.. ఇప్పుడు కేంద్రాన్నే తప్పు పడుతున్నారు.

చేతకాని వాడే కులాల గురించి మాట్లాడతారని నా అభిప్రాయం. అన్ని కులాలు నా కులాలే.

అనంతపురంలో కియా పెడితే బడుగులకే ఎక్కువ లబ్ది చేకూరింది.

కుప్పంలో 100 కమ్మ కుటుంబాలు కూడా ఉండవు. నాకు ఓట్లేసి గెలిపించింది బడుగులే.

ఏ కులంలో పేదరికం ఉంటే.. ఆ కులానికే నా ప్రాధాన్యత.

సిఎం జగన్ తనకు వస్తే రెడ్లను కూడా తిడతాడు.

ప్రస్తుతం కాపులను తిడుతున్న జగన్.. త్వరలోనే రెడ్లను తిడతారేమో..?

సంపద సృష్టి లేకుండా సంక్షేమం ఎలా అమలు చేస్తారు..?

సంక్షేమ పథకాల్లో నిబంధనలు పెట్టి కోత విధిస్తున్నారు. ఎక్కువ కరెంట్ వాడితే అమ్మ ఒడి కట్.

మా హయంలో ఇరిగేషనుకు ఐదేళ్లల్లో రూ. 64 వేల కోట్లు ఖర్చు పెట్టాం.

తప్పును ఎత్తి చూపిన వాళ్లు అధికార పార్టీ నేతలైనా.. వారి పైనా దాడులు చేస్తున్నారు.

వడ్డెర కార్పోరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతిపై దాడి చేశారు.

ఓ ఎంపీ గుడ్డలూడదీసి తిరిగితే సీఎం సమర్దిస్తున్నారు.

గౌరవంగా ఉండాల్సిన ఎంపీ గుడ్డలూడదీసుకుని తిరుగుతోంటే.. మాపై కేసులు పెడతారంట.

గౌరవప్రదమైన మహిళలు వైసీపీలో ఉండలేరంటూ ఉయ్యూరు జెడ్పీటీసీ తన పదవికి రాజీనామా చేశారు.

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు చిత్తూరు జిల్లాలో కిషన్ అనే వ్యక్తిని చంపేశారు.

ప్రభుత్వం..అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు.. వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

క్వారీలను కబ్జా చేసేస్తున్నారు.

విషపూరిత మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్నారు.

ప్రజలు ప్రాణాసు పోయినా ఫర్వాలేదు.. మహిళల తాళిబొట్లు తెగిపోయినా ఫర్వాలేదు.. తమకు డబ్బు రావాల్సిందేననే రీతిలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు.

జాగ్రత్తగా కూడబెట్టుకున్న ఆస్తులను గత మూడేళ్లల్లో చాలా చోట్ల కబ్జాలు చేసేశారు.

మేం ప్రభుత్వంలో ఉండగా.. ఎవరి మీదైనా కేసులు పెట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించేవాళ్లం.

కానీ ఇప్పుడు ఈ సభలో మాట్లాడిన నా మీద కేసు పెట్టినా పెట్టేస్తారు.

కొందరు పోలీసులు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేస్తే ఛార్జీ షీటు దాఖలు చేయడంలో కూడా తీవ్ర జాప్యం చేశారు.

ఈ ప్రభుత్వం విధ్వంసం ప్రజా వేదికతో ప్రారంభం అయింది.

ఈ ప్రభుత్వంపై మేము చేస్తున్న పోరాటానికి పెద్ద ఎత్తున ప్రజలు సహకరించాలి

అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని సాగానంపుదాం

Also Read అది విద్యాదీవెన కాదు, దగా: రామానాయుడు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్