Box Office: టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జునను ఇప్పటి వరకు చూడని విధంగా సరికొత్తగా చూపిస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి క్రేజ్ ఏర్పడింది. ఇక టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అయితే.. ది ఘోస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు ది ఘోస్ట్ మూవీ రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే.. ది ఘోస్ట్ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల కాలంలో నాగార్జున నటించిన ఏ సినిమాకి రానంత క్రేజ్ ఈ మూవీకి వచ్చింది. ఇదిలా ఉంటే.. దసరా కానుకగా అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. చిరంజీవి, నాగార్జున.. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అలాంటిది వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతుండడం అటు చిరు అభిమానుల్లోనూ, ఇటు నాగార్జున అభిమానుల్లోనూ ఆసక్తిగా మారింది.
ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు సినిమాలకు నష్టం కలుగుతుంది. అందుచేత ఒక రెండు మూడు రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు వస్తే మంచిదని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రకటించినట్టుగా చిరు గాడ్ ఫాదర్, నాగ్ ది ఘోస్ట్ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అవుతాయా..? లేదా ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా రెండు మూడు రోజులు ఆలస్యంగా వస్తుందా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరగనుందో..? ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Also Read: ఆగస్టు 25న ‘ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్