Saturday, November 23, 2024
HomeTrending Newsఈ నాలుగూ ప్రధానాంశాలు: స్పందనలో సిఎం

ఈ నాలుగూ ప్రధానాంశాలు: స్పందనలో సిఎం

గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నాలుగు గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్పు చేస్తాయని, ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అక్టోబరు 31 నాటికల్లా వీటి నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి సిఎం జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఉపాధిహామీ పనులు, విద్య, వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు, ఇళ్లపట్టాలు, గృహనిర్మాణం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష, స్పందన తదితర అంశాలపై కూడా అడిగి తెలుసుకున్నారు.

సిఎం చేసిన సూచనల్లో ముఖ్యాంశాలు:

  • ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి కనిపించింది.
  • అన్ని జిల్లాల్లో సగటున 117 శాతం పనిదినాల కల్పన జరుగుతోంది
  • ఉపాధి హామీలో మనం దేశంలో మనం 2వ స్థానంలో ఉన్నాం
  • డిసెంబరు నాటికి 4500 గ్రామాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ చేరుతుంది
  • మంజూరుచేసిన 3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాన్ని డిసెంబర్‌ నాటికి పూర్తిచేయాలి
  • మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి
  • మొదటి విడతలో 15, 715 స్కూళ్లను బాగుచేశాం. రెండో విడత కింద 22,279 స్కూళ్లలో నాడు – నేడు కింద పనులు చేపట్టాం
  • నాడు – నేడుకు నిధులు కూడా సకాలంలో అందిస్తున్నాం, ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది
  • రాష్ట్రంలో 16 మెడికల్‌కాలేజీల నిర్మాణ పనులనూ కలెక్టర్లు నిరంతరం పరిశీలన చేయాలి

  • వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌ కూడా వెంటనే పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి
  • ఇళ్ల నిర్మాణపనులు వేగవంతం చేయాలి
  • అక్టోబరు 1 నాటికి 2వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు పత్రాలు
  • తర్వాత ప్రతినెలా వేయి గ్రామాల చొప్పున భూ హక్కు పత్రాలు
  • స్పందన వినతులను ఎలా పరిష్కరిస్తున్నారన్నదానిపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కచ్చితంగా జరగాలి
  • సంబంధిత సిబ్బంది ఆ సమయంలో అందుబాటులో ఉండాలి
  • ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలి
  • ప్రతి బుధవారం .. స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి
  • ప్రతి గురువారం చీఫ్‌సెక్రటరీ జిల్లాకలెక్టర్లతో స్పందనపై సమీక్షచేయాలి.
  • అదే సమయంలో సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ పైనా రివ్యూ చేయాలి:
  • సచివాలయాల్లో ప్రాధాన్యతా పనులకు రూ.3వేల కోట్లు:
  • గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారు
  • ఒక సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు పర్యటిస్తున్నారు, ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు
  • ప్రజలనుంచి వినతుల్లో ప్రాధాన్యతా పనులను గుర్తించి వాటిపైన ఒక విజ్ఞప్తిని సంబంధిత ఎమ్మెల్యే పంపిస్తున్నారు
  • ఈ ప్రాధాన్యతా పనులను పూర్తిచేయడానికి ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల రూపాయలను కేటాయించాం
  • ఈ పనులు చేపట్టేలా, యద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది
  • దాదాపు 15వేల సచివాలయాలకు ప్రాధాన్యతా పనులకోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం:
  • గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలి. దీనివల్ల అనుకున్న కార్యక్రమాలను
  • సమర్థవంతంగా అమలు చేయడానికి, సమన్వయ పరచడానికి అవగాహన ఏర్పడుతుంది
  • స్పందన కార్యక్రమాన్ని నేనే నేరుగా పర్యవేక్షిస్తాను

  • వృద్ధిరేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరం
  • 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరం. దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది
  • కీలక రంగాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా
  • కలెక్టర్లందరినీ అభినందిస్తున్నా, ఈ వృద్ధి నిలకడగా కొనసాగాల్సిన అవసరం ఉంది:
  • జాతీయ రహదారులు– భూసేకరణ, దిశా, డ్రగ్స్ అంశాలపై కూడా సిఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు
  • ఈనెల 25న, ఎల్లుండి నేతన్న నేస్తం, సెప్టెంబర్ 22న వైయస్సార్‌ చేయూత కార్యక్రమం అమలు చేస్తున్నాం

స్పందన వీసీలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్లానింగ్‌ సెక్రటరీ విజయ్‌ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : ఇదో అరుదైన ఘట్టం: సిఎం జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్