ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ పేరుతో రాష్ట్రంలోని వైసీపీయేతర పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన నేతలు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ కర్ తో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ నేతృత్వంలో వారిని కలుసుకుని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ విషయంలో కలగజేసుకొని సదరు ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.
‘మీరు ధైర్యంగా ఉండండి. మీ పోరాటం మీరు కొనసాగించండి. పరిశీలిస్తాను’ అని రాష్ట్రపతి హామీ ఇచ్చారని మహిళా నేతలు వెల్లడించారు.