Friday, June 12, 2026
HomeTrending Newsద్రౌపది ముర్ముకు సిఎం జగన్ శుభాకాంక్షలు

ద్రౌపది ముర్ముకు సిఎం జగన్ శుభాకాంక్షలు

భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ మెజార్టీతో ఆమె సాధించిన ఈ విజయం తమ పార్టీ వైఎస్సార్చీపీ బలంగా విశ్వసిస్తున్న, పాటిస్తున్న సామాజిక న్యాయ సిద్ధాంతానికి ప్రతీకగా నిలిస్తున్దన్నారు.

మహిళా సాధికారత, బలహీన వర్గాల సంక్షేమంలో ఆంధ్ర ప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొంటూ ప్రజా జీవితంలో ద్రౌపది ముర్ము అనుభవం రాష్ట్రపతి పదవికి మరింత వన్నె తెస్తుందని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular