భారత క్రికెట్ జట్టు మాజీ టెస్ట్ ప్లేయర్, బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ టీమిండియా సీనియర్ జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్ గా నియమితులయ్యాడు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోవిడ్ బారిన పడ్డారు. దీనితో ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో పాల్గొనేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళిన టీమిండియాతో ద్రావిడ్ వెళ్ళలేకపోయాడు. కోవిడ్ నుంచి కోలుకోగానే అయన జట్టుతో చేరతాడని బిసిసిఐ నిన్న ప్రకటించింది.
మొన్న జింబాబ్వేతో ఆ దేశంలో ముగిసిన మూడు వన్డేల సిరీస్ ఆడిన భారత జట్టుకు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కెఎల్ రాహూల్ సారధ్యంలో ఆడిన యువ బృందం ఆ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
దీనితో రాహుల్ జట్టుతో చేరే వరకూ లక్ష్మణ్ కు ఆ బాధ్యతలు అప్పగించాలని బిసిసిఐ నిర్ణయించింది.
Also Read : కోవిడ్ బారిన టీమిండియా కోచ్