మెగా హీరోలు క్రికెట్ మ్యాచ్ కి కావాల్సినంత మంది ఉన్నారు. వారిలో నాగబాబు, చరణ్ ప్రొడ్యూసర్స్ గా సినిమాలు కూడా నిర్మించారు. అయితే.. ఇప్పటి వరకు మెగా హీరోల్లో ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే జానీ అనే సినిమాకు డైరెక్షన్ చేశారు. ఆ తర్వాత వారిలో ఎవరూ డైరెక్షన్ చేయలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ డైరెక్షన్ చేస్తానంటున్నారు.
‘ఉప్పెన’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే అందర్నీ ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సాధించారు. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా‘ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో వైష్ణవ్ పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ఇంకా చెప్పాలంటే.. తన కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తాను కొన్ని రోజుల తర్వాత యాక్టింగ్ ఆపేస్తానని వెల్లడించాడు. తనకు డైరెక్షన్ అంటే ఇష్టమని, దానిపై దృష్టిసారిస్తానని చెప్పాడు. “ఇప్పటికే ఒక కథ కూడా రాసుకున్నాను. అన్నయ్య సాయి ధరమ్ తేజ్, బావ వరుణ్ తేజ్ లతో ఓ మల్టీస్టారర్ తీయాలనుకుంటున్నాను. త్వరలోనే ఆ సినిమా వస్తుంది” అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పాడు. మెగా మల్టీస్టారర్ ను మెగా హీరో వైష్ణవ్ తేజ్ తీస్తే సంచలనమే.