How it is? ఓవైపు జరుగుతున్నది జరుగుతున్నట్టు.. మరోవైపు ఆ రైటర్ పేపర్ పై ఎలా పెట్టగల్గుతున్నాడు…? అదే DEJAVU!
వర్తమానంలో జరుగుతున్నది జరుగుతున్నట్టుగా నేరదృశ్యాలన్నీ ఓ రచయిత తన క్రియేటివ్ కథగా పేపర్ పైకెక్కిస్తుండటంతో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది.. DEJAVU! అనుభవానికీ, ఓ రైటర్ రాస్తున్నదానికీ ఇసుమంత తేడా లేకుండా ఉండటమే ఈ సినిమా టైటిల్ అర్థం కూడాను!
అయితే పోలీస్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ లో… అందులోనూ ఓ డీజీపీ కూతురు కిడ్నాపింగ్ వంటి వ్యవహారంలో… జరుగుతున్నది జరుగుతున్నట్టుగా కళ్లకు కట్టేలా రైటర్ తన కథలో కారు నంబర్లతో సహా రాస్తుండటం… యాదృచ్ఛికమనుకునేందుకు అవకాశం లేని తర్కదూరమైన ప్రిడిక్షన్ గా ప్రేక్షకుడు ఫీలయ్యే అవకాశాన్ని కల్పించడం మళ్లీ ఈ DEJA VU లో మైనస్ పాయింట్.
తాను రాస్తున్న కథలోని పాత్రలే ప్రాణం పోసుకుని తనను బెదిరింపు కాల్స్ కు గురి చేస్తున్నాయంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కే రైటర్.. అతణ్ని చూసి పోలీసులు నవ్వుకోవడం నుంచి… సినిమా మెల్లిగా సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఎలా అడుగులు వేస్తుందన్నది మాత్రం తన మొట్టమొదటి చిత్రంతోనే దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ బిగి సడలకుండా తీసి మెప్పించాడు.
ఓ ఇన్ ఫ్లూయెన్సివ్ క్యారెక్టర్ ను తప్పించేందుకు… ఓ ఫేక్ ఎన్ కౌంటర్ చేసే పోలీస్ ఆఫీసర్.. అందుకామె అందుకోబోయే అత్యున్నత పోలీస్ పదవి… ఆ ఫేక్ ఎన్ కౌంటర్ లో అసువులు బాసిన కుటుంబపు ప్రతీకారేచ్ఛ… ఆ ఇన్ ప్లూయెన్సివ్ క్యారెక్టర్ హత్యాచారం చేసిన ఓ అమ్మాయి తాలూకు ప్రేమికుడి రివేంజ్… ఇలా భిన్నమైన మలుపులతో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే తమిళ మాతృకలో ఉన్న ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఫాలో అవుతూ కూడా కావల్సినంత థ్రిల్ మాత్రం పొందవచ్చు.
జిబ్రాన్ సంగీతంలోని బీజీఎం ఎఫెక్ట్స్ ఈ సినిమాకు మరింత ప్లస్ కాగా… అసలు హీరోయిన్ పాత్ర.. ఎలాంటి రొమాన్స్ సీన్స్ వంటివి లేకుండా అలరించే సస్పెన్స్ థ్రిల్లర్ DEJA VU! విక్రమ్ కుమార్ పాత్రలో… అరుల్నితి తమిళరసు పెర్ ఫెక్ట్ ఎంపిక కాగా… డీజీపీ పాత్రలో మధుబాల ఎంపికను అదేస్థాయని మాత్రం చెప్పలేము. అయితే మొత్తంగా DEJA VU ఆసక్తికరంగా సాగే మరో సస్పెన్స్ థ్రిల్లర్… అందుకు అమెజాన్ ప్రైమ్ వేదిక. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి మరో గుడ్ ఛాయిస్ ఈ మూవీ!
Also Read :