సిఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చారని తెలుగుదేశం లోక్ సభా పక్ష నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకు వస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు దానిపై కనీసం మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సీ వేస్తామని నాడు ప్రకటించి, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు కూడా పీకేసే చర్యలు మొదలు పెట్టారని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిరుద్యోగ రణం యాత్ర నిర్వహించారు. ఈ నిరుద్యోగ పారాట ర్యాలీలో రామ్మోహన్ నాయుడు, టిడిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ సిఎం జగన్ పై విమర్శలు చేశారు. ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని అవినీతికి పాల్పడుతున్నారని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
Also Read : విభజన హామీల సాధనలో వైసీపీ విఫలం: రామ్మోహన్