Sunday, June 2, 2024
HomeTrending Newsగ్రీన్ ఎనర్జీతో ఆర్ధిక వ్యవస్థకు ఊతం: సిఎం

గ్రీన్ ఎనర్జీతో ఆర్ధిక వ్యవస్థకు ఊతం: సిఎం

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని,  భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వీటి ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని, క్లీన్‌ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుందని, దీనితో వారికి ఆదాయాలు కూడా పెరుగుతాయన్నారు.  పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటికోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయని వివరించారు. వీటిద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుందన్నారు. క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది, దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్  ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనితో పాటు పలు ఇతర పరిశ్రమలకు కూడా బోర్డు ఆమోద ముద్ర వేసింది.

నేటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:

  •  వైయస్సార్‌జిల్లా కొప్పర్తిలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న కాసిస్‌ ఇ–మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
  • రూ. 386.23 కోట్ల పెట్టుబడి ….ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్లు
  • 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు.
  • కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న  లైఫిజ్‌ ఫార్మా. మొత్తంగా రూ.1900 కోట్ల పెట్టుబడి; 2వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ఏప్రిల్‌ 2024 నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తిచేయాలని లక్ష్యం.
  • పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలను సేకరించిన కంపెనీ.
  • మెటలార్జికల్‌గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్‌ మరియు రోల్డ్‌ గ్లాసెస్‌ తదితర వాటి తయారీకోసం పరిశ్రమతోపాటు సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి.
  • 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేలమందికి పరోక్షంగా ఉద్యోగాలు.
  • నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతోపాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పనున్న ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • కృష్ణా జిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్న అవిశా ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
  • రూ. 150 కోట్ల పెట్టుబడి, 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.  2023 మార్చకల్లా పూర్తిచేసే దిశగా కంపెనీ అడుగులు.
  • దీనికోసం 11.64 ఎకరాల భూమి కేటాయింపు.
  •  ఆరు గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకూ ఎస్‌ఐపీబీ ఆమోదం.
  • ఈ ఆరు ప్రాజెక్టులకోసం రూ.81,043 కోట్ల పెట్టుబడి.
  • 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన.

ఉప ముఖ్యమంత్రి (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతులశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక, ఉపాధి, శిక్షణశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read : ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్