గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో కీలక హామీని నేరవేర్చేదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, భవన కార్మికుల కుటుంబాల్లోని నిరుపేద ఆడపిల్లల కళ్యాణానికి ఆర్ధికసహాయం అందించే ఉద్దేశంతో వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని అక్టోబరు 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం అందించనున్న సాయం వివరాలు జీవోలో పేర్కొన్నారు. అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు నిన్దాలన్న నిబంధన విధించారు. పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం అందజేయనున్నారు.
ఎస్సీలకు
- వైఎస్సార్ కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు
- ఎస్సీల కులాంతర వివాహాలకు రూ. 1.2 లక్షలు
ఎస్టీలకు
- కళ్యాణమస్తు కింద రూ. 1 లక్ష
- ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
బీసీలకు
- కళ్యాణమస్తు కింద రూ.50వేలు
- బీసీల కులాంతర వివాహాలకు రూ.75వేలు
- మైనార్టీలకు షాదీ తోఫా కింద ఒక లక్షరూపాయలు
- వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు
- భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు
ఈ హామీతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిట్లవుతుంది.
Also Read:కృష్ణం రాజు మృతికి సిఎం జగన్ సంతాపం