ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి కే తారక రామారావు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదన్న కేటీఆర్ వీఆర్ఏల డిమాండ్ల పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రొత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు తమ ఆందోళనలను విరమించి విధుల్లో జాయిన్ కావాలని కేటీఆర్ కోరారు.
ఈ నెల 17వ తేదీన జాతీయ సమైక్యత వజ్రోతవ సంబరాలు ముగిసిన అనంతరం 18వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని వీఆర్ఏల ప్రతినిధులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ తమను పిలిచి తమ వాదన వినడం పట్ల వీఆర్ఏల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఈ నెల 20 వరకు ఆందోళనలు కొనసాగిస్తమని విఆర్ఏ ప్రతినిధులు వెల్లడించారు.
Also Read : వీఆర్ఓ ల కేటాయింపు ప్రక్రియ పూర్తి