Sunday, January 19, 2025
Homeసినిమా అఖిల్ ఏజెంట్ వ‌చ్చేది ఎప్పుడు..?

 అఖిల్ ఏజెంట్ వ‌చ్చేది ఎప్పుడు..?

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్‘. ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అఖిల్ స‌ర‌స‌న సాక్షి వైద్య న‌టిస్తుంది. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్మ‌ట్టి  కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ స‌క్సెస్ త‌ర్వాత అఖిల్ చేస్తున్న మూవీ కావ‌డం.. ఇది అఖిల్ కు ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఏజెంట్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ ఇయ‌ర్ డిసెంబ‌ర్ లో రావాలి కానీ.. వాయిదా ప‌డింది. ఆత‌ర్వాత ఆగ‌ష్టులో రిలీజ్ చేయాలనుకున్నారు వాయిదా ప‌డింది. ఆత‌ర్వాత ఈ డిసెంబ‌ర్ లో ఏజెంట్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే… ఇప్పుడు డిసెంబ‌ర్ లో కూడా ఏజెంట్ మూవీ రిలీజ్ కావ‌డం లేద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఏజెంట్  మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుంది. కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట కానీ.. సంక్రాంతికి వ‌చ్చే సినిమాలు ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశాయి. అందుచేత జ‌న‌వ‌రిలో కూడా ఏజెంట్ రావ‌డం అనుమాన‌మే అంటున్నారు. మ‌రి.. ఏజెంట్ వ‌చ్చేది ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. త్వ‌ర‌లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : బాలీవుడ్ కి నిద్ర‌లేకుండా చేస్తున్న ఏజెంట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్