రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై ఓ పధ్ధతి ప్రకారం విషప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితికి, ఆర్ధిక ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని, ఏదైనా ఉంటే చంద్రబాబుకే ఉండాలని వ్యాఖ్యానించారు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుండకపోతే తాము బాగుంటామని వారు భావిస్తారని… బాగుంటే వారు జీర్ణించుకోలేరని విమర్శించారు. వారికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో లేదని కొన్ని మీడియా సంస్థలు ఈ విషయంపై అభాండాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అసెంబ్లీలో సిఎం జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- కేంద్ర ప్రభుత్వానికి, వివిధ ఆర్ధిక సంస్థలకు మాత్రమే కాకుండా కోర్టులకు కూడా తప్పుడు లేఖలు రాసి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపేయాలని ప్రయతిస్తున్నారు
- రాష్ట్రం శ్రీలంక అయ్యిందని ప్రచారం చేస్తున్నారు
- కోవిడ్ మహమ్మారితో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి ఎంత సవాల్ వచ్చినా, గత ప్రభుత్వం కంటే, దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఆర్ధిక నిర్వహణ బాగా చేయగలిగాం
- రాష్ట్రమంతా అభివృద్ధి- ఇంటింటా సంక్షేమం అందిస్తున్నాం, మేనిఫెస్టోలో ఇచ్చిన 98.44 శాతం హామీలు నేరవేర్చాం
- బాబు ప్రభుత్వంలో చేయలేని ఎన్నో పథకాలు తాము చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు
- జిఎస్ డి పి లో 11.43 శాతంతో దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉన్నాం
- దేశ జిడిపిలో రాష్ట్ర వాటా గత ప్రభుత్వ హయాంలో 4.45 % అయితే, మా హయంలో అది 5 శాతం చేరుకుంది
- విభజన సమయానికి ఏపీ అప్పు – 1,26,556 కోట్లు
- 2019 మే నాటికి ఈ అప్పు – 2,69,462 కోట్లు
- అప్పులో పెరుగుదల శాతం – 123.52శాతం
- 2019 మే నుంచి 2022 మార్చి నాటికి అప్పు – 3,82,165
- అప్పులో పెరుగుదల శాతం – 41.83 శాతం
- విభజన సమయానికి ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు – 14,028.23
- చంద్రబాబు దిగిపోయే సమయానికి ఈ అప్పులు – 59.257.31
- తమ హయాంలో ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు -1,17,730.33
మొత్తం రుణాలు (ప్రభుత్వ రుణాలు, గ్యారంటీతో చేసినవి)
- బాబు దిగిపోయే నాటికి అప్పులు 3,28,719కోట్లు
- ఈ మూడేళ్ళకు అవి చేరుకున్నవి- 4,99,895
- కోవిడ్ సమయంలో కూడా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనే గ్రోత్ రేట్ లో పెరుగుదల ఉంటే, దానిలో ఏపీ కూడా ఉంది
- కోవిడ్ సమయంలో ప్రజల కొనుగోలుశక్తి, వస్తువులకు డిమాండ్ పడిపోకుండా చేయగలిగాం
- వైఎస్సార్ ఆసరా, చేయూత లాంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చాం
- అసాధారణ స్థాయిలో అప్పులు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు.
- జీఎస్దీపీ, అప్పులు, కార్పొరేషన్ రుణాల విషయంలో కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే తాము తక్కువే తీసుకున్నాం
- కేంద్ర ప్రభుత్వ అప్పుల శాతంతో పోల్చుకున్నా కూడా మన పరిస్థితి మెరుగ్గానే ఉంది.
- మూలధన వ్యయంపై ఖర్చు చేయడంలేదని అంటున్నారు
- నాడు-నేడు కింద ప్రభూత్వ స్కూళ్ళు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
- మూలధన వ్యయం విషయంలో కూడా గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువగా ఖర్చు పెట్టాం
- కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కూడా తగ్గింది.
- కేవలం ప్రభుత్వంపై బురద జల్లాలనే అవాస్తవాలు కొందరు రోజూ ప్రచారం చేస్తున్నారు
- రాష్ట్ర ప్రజలంతా ఈ విషయమై ఆలోచన చేయాలి
- తప్పుడు మాటలు, అబద్ధాలు నమ్మవద్దు, ప్రభుత్వం చేసే మంచి పనులు చూడండి
Also Read : రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్యం బాగుంది: సిఎం జగన్