పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఆయన ఓకే చేసిన ప్రాజెక్టుల షూటింగ్ విషయంలో చాలా ఆలస్యం అవుతోంది. ‘హరి హర వీరమల్లు‘ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సింది కానీ ఇప్పటివరకూ యాభై శాతం షూటింగ్ మాత్రమే అయ్యింది.
అక్టోబర్ నుంచి పవన్ ఏపీలో యాత్ర చేయాలనుకున్నారు. దీంతో మరోసారి అయన షూటింగ్ లకు బ్రేక్ పడుతుందనుకున్నారు. ఇప్పుడు పవన్ ప్లాన్ మారింది, తన పొలిటికల్ టూర్ ను ఇంకొన్ని రోజులు వాయిదా వేశారు. అందుచేత ఈ మూడు నెలలు పూర్తిగా సినిమాల మీదే కాన్ సన్ ట్రేషన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ముందుగా క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న హరి హర వీరమల్లు సినిమాని నెల రోజుల్లో కంప్లీట్ చేయాలని.. డేట్స్ ఇచ్చారట.
ఆతర్వాత సాహో డైరెక్టర్ సుజిత్ తో చేయనున్న మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ సినిమాకి కూడా నెల రోజులు డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత వినోదయ సీతం రీమేక్ లో జాయిన్ అవుతారు. ఈ మూవీకి కూడా నెల రోజులు డేట్స్ ఇచ్చారు. ఇలా మూడు సినిమాలకు మూడు నెలల టైమ్ కేటాయించాలని ఫిక్స్ అయ్యారు. అయితే.. ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న ‘భవదీయుడు భగత్ సింగ్’ మాత్రం ఎప్పటి నుంచి సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ లేదు. మరి.. హరీష్ శంకర్ ఇంకా వెయిట్ చేస్తాడో.? వేరే సినిమా స్టార్ట్ చేస్తాడో చూడాలి.
Also Read: హరిహర వీరమల్లు‘ ప్రచార చిత్రం విడుదల