Saturday, January 18, 2025
Homeసినిమాస‌లార్ సెట్ లో ప్ర‌భాస్? అస‌లు కార‌ణం ఇదే

స‌లార్ సెట్ లో ప్ర‌భాస్? అస‌లు కార‌ణం ఇదే

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ చిత్రం ‘స‌లార్‘. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శృతిహాస‌న్  హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ నెల‌11న ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజు చ‌నిపోయారు. ఈ నెల 29న మొగ‌ల్తూరులో ఆయ‌న సంస్మ‌ర‌ణ స‌భ జ‌ర‌గ‌నుంది. పెద‌నాన్న చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి షూటింగ్ మానేసి ఇంటికే ప‌రిమితం అయ్యారు ప్రభాస్. సంస్మ‌ర‌ణ స‌భ అనంత‌రం ఆయన షూటింగ్ లో జాయిన్ అవుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఊహించ‌ని విధంగా ప్ర‌భాస్ స‌లార్ సెట్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. కార‌ణం ఏంటంటే… పెద‌నాన్న కృష్ణంరాజు మృతిని ప్ర‌భాస్ త‌ట్టుకోలేక‌పోతున్నాడు. క‌నీసం సెట్ ఉంటే.. వ‌ర్క్ పై శ్ర‌ద్ద పెట్ట‌డం వ‌ల‌న కోలుకుంటాడ‌ని ఫ్రెండ్స్ చెప్ప‌డం వ‌ల‌న షూటింగ్ లో జాయిన్ అయ్యాడ‌ట.

ఇప్ప‌టి వ‌ర‌కు స‌లార్ షూటింగ్ 60 శాతం పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలనుకుంటున్నారు మేక‌ర్స్. ఈ సినిమాని 2023 సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్