ఫ్లోరోసిస్ భూతంతో మునుగోడు ను జీవచ్చంగా మార్చింది కాంగ్రెస్, బిజెపిలే నని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి పార్టీలకు ఓట్లు వెయ్యడం అంటే మన ఘోరీలను మనం కట్టుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు. అటువంటి ఫ్లోరోసిస్ నుండి విముక్తి చేసిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన టి ఆర్ యస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టి ఆర్ యస్ పార్టీ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ యం ఎల్ సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శాసన మండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, శాసనసభ్యులు,జిల్లా టి ఆర్ యస్ అధ్యక్షుడు ఎన్ రవీంద్ర నాయక్, నియోజకవర్గ టి ఆర్ యస్ ఇంచార్జ్, మాజీ యం ఎల్ ఏ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,స్థానిక జడ్ పి టి సి ఏ వి రెడ్డి, యం పి పి ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి లతో పాటు మండల పరిధిలోని స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లోరోసిస్ కబంధ హాస్టల్లో చిక్కుకున్న మునుగోడును మిషన్ భగీరధ పధకంతో బంధ విముక్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.మునుగోడు ప్రజలు జీవచ్చంగా బతకొద్దు అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు.బిజెపి కీ ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు బిగించాలి అని ఒప్పుకున్సట్లే అవుతుందన్నారు.వ్యవసాయ దారులు ఈ విషయంలో ఆలోచన చెయ్యాలని ఆయాన విజ్ఞప్తి చేశారు. వ్యవసాయానికి 24 గుంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టి ఆర్ యస్ ప్రభుత్వమే నని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read : జోడో యాత్రతో ఎవరిని జోడిస్తారు – జగదీష్ రెడ్డి ఎద్దేవా