దేశ జనాభా గణనలో (Census) బీసీ కులాల లెక్కింపునకై ప్రధానమంత్రికి కోటి ఉత్తరాల ఉద్యమ రాష్ట్రానికి చెందిన బిసి ఉద్యమకారులు ప్రారంభించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా బీసీ కులాల కాలం చేర్చబడలేదని బిసి కులగణన కోటి ఉత్తరాల ఉద్యమకర్త -డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. తద్వారా దేశంలో, రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క ఇంతవరకు అంతు పట్టని అంశమన్నారు. బీసీలు సంఖ్య ఎంత ఉందో జనాభా గణన లేదా సెన్సెస్ లో తేల్చాలని డిమాండ్ చేశారు. దేంతో బిసీ లకు రాజ్యాంగపరంగా రావలసిన హక్కులు వస్తాయన్నారు.
బడుగు బలహీన వర్గాల తరపున సామాజిక బాధ్యతగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకేల్లెందుకే దేశవ్యాప్త కోటి ఉత్తరాలతో విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీసీ కుల బంధువులు తమ వంతు బాధ్యతగా ఒక ఉత్తరాన్ని ప్రధానమంత్రికి చేరవేయాలని డాక్టర్ పరికిపండ్ల అశోక్ కోరారు. దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమము ప్రారంభ ఉత్సవం కాజీపేట ప్రెస్ క్లబ్ కేంద్రంగా ఈ రోజు(04-10- 2022) నుంచి ప్రారంభిస్తున్నట్టు డాక్టర్ పరికిపండ్ల అశోక్ వెల్లడించారు. బీసీ లందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని తమ బాధ్యత నెరవేర్చాలని బిసి కులగణన కోటి ఉత్తరాల ఉద్యమకర్త -డాక్టర్ పరికిపండ్ల అశోక్ విజ్ఞప్తి చేశారు.
Also Read : బిసిలకు కేసీయార్ అండ: తలసాని