Monday, February 24, 2025
Homeసినిమారామ్, బోయ‌పాటి లేటెస్ట్ అప్ డేట్

రామ్, బోయ‌పాటి లేటెస్ట్ అప్ డేట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో  ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సినిమా లాంఛనంగా ప్రారంభమైంది కానీ.. ఇంకా సెట్ పైకి వెళ్ల‌క‌పోవ‌డంతో ఆ సినిమా ఆగింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ సినిమా కంటే ముందుగా రామ్ గౌత‌మ్ మీన‌న్ తో సినిమా చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో రామ్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?  బోయ‌పాటితోనా..?  గౌత‌మ్ మీన‌న్ తోనా..? అనేది ఆస‌క్తిగా మారింది.

అయితే… ద‌స‌రా సంద‌ర్భంగా రామ్, బోయ‌పాటి మూవీ నుంచి ఓ పోస్టర్ విడుదల చేశారు. బోయపాటి ర్యాపో షూటింగ్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు. రామోజీ ఫిలిం సిటీలో తొలి షెడ్యూల్ ని ప్లాన్ చేసారు. దీనిలో భాగంగా  బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో టీమ్ వేటకి సిద్దమవుతోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేశారు. మ‌రి.. పాన్ ఇండియా రేంజ్ లో వస్తోన్న  రామ్, బోయ‌పాటి మూవీ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్