టాలీవుడ్ కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్ధాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ సినిమా తర్వాత నాగార్జున.. గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహనరాజా డైరెక్షన్ లో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రకటించనున్నారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మోహనరాజా త్వరలోనే నాగ్ సినిమా వర్క్ స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో నిర్మాత ఎన్.వి. ప్రసాద్ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటపెట్టారు.
ఇంతకీ ఏం చెప్పారంటే… మోహనరాజా చెప్పిన కథకు నాగార్జున ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారట. అయితే.. గాడ్ ఫాదర్ మూవీకి మోహనరాజా కరెక్ట్ ఛాయిస్ అని ఎన్వీ ప్రసాద్ ఫీలయ్యారట. ఆ విషయం చిరంజీవికి చెబితే ఆయన ఓకే అన్నారట. మోహనరాజా నాగార్జునతో సినిమా చేస్తున్నారని తెలిసి చిరు, నాగ్ కి ఫోన్ చేసి మోహనరాజాతో సినిమాని ఓ ఆరు నెలల తర్వాత చేసుకోండి. మీరు ఇప్పుడు మాకు అనుమతి ఇస్తే.. మోహనరాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మూవీ చేయాలనుకుంటున్నాను అని చెప్పారట చిరు. దీనికి నాగ్ ఓకే చెప్పారట. ఈ విషయాన్ని గాడ్ పాదర్ సక్సెస్ మీట్ లో నిర్మాత ఎన్.వి. ప్రసాద్ బయటపెట్టారు.