Sunday, February 23, 2025
HomeTrending Newsవైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

ఉత్త‌రాంధ్రుల క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల‌ ఇల‌వేల్పు శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం లక్షలాది మంది భక్తుల మధ్య వైభవంగా జరుగుతోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి(దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ అమ్మ‌వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  ఆల‌యం వద్దకు చేరుకున్న మంత్రికి పూజారులు  పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనతరం మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి  ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  డిప్యూటీ సిఎం కు తీర్థ‌ప్ర‌సాదాలు అందజేశారు.

అనంత‌రం కొట్టు స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. సిఎం జగన్ సంకల్పించిన పరిపాలనా వికేంద్రీక‌ర‌ణ జరిగేలా చూడాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు.

Also Readవైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

RELATED ARTICLES

Most Popular

న్యూస్