Sunday, November 24, 2024
HomeTrending Newsపుల్వామలో ఎన్ ఐ ఏ సోదాలు

పుల్వామలో ఎన్ ఐ ఏ సోదాలు

ఉత్తర కశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో ఇవాళ జరిగిన గ్రేనేడ్‌ దాడిలో ఇద్దరు స్థానికేతర కార్మికులు మృతి చెందారు. కార్మికులు నివసిస్తున్న ప్రీ ఫాబ్రికేటెడ్‌ షెల్టర్‌పై ఉగ్రవాదులు గ్రేనేడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో యూపీలోని  కన్నోజ్ కు చెందిన మోనిష్‌ కుమార్‌, రామ్‌ సాగర్‌ ప్రాణాలు కోల్పోయారు. సోఫియాన్‌ జిల్లా ఆస్పత్రికి వాళ్లను తరలించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని సీజ్‌ చేసి దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

లష్కరే తోయిబా సంస్థకు చెందిన హైబ్రిడ్‌ మిలిటెంట్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతున్నట్లు ఆఫీసర్‌ విజయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.  శనివారం 48 ఏళ్ల కశ్మీర్‌ పండిట్‌ను కూడా సోఫియాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన విషయం తెలిసిందే.

మరోవైపు పుల్వామా జిల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) , జమ్ముకాశ్మీర్ పోలీసులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు జల్లెడ పడుతున్నారు. నిన్న పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ ను అమృతసర్ లో కుల్చివేసిన సైన్యం… దర్యాప్తు బృందాలకు వీటికి సంబంధించిన సమాచారం ఆధారంగా పుల్వమా లో ఈ రోజు వేకువ జాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read : జమ్ముకాశ్మీర్ లో మరో పండిట్ హత్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్