తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా నేడు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యమంత్రికి బిశ్వజిత్ దాస్‌గుప్తా వివరించారు. డిసెంబర్ 4 ఇండియన్ నేవీ డే సందర్భంగా విశాఖలో జరిగే వేడుకలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తాని సన్మానించి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని సిఎం జగన్ అందజేయగా … సిఎం కు ఐఎన్‌ఎస్ విక్రాంత్ మోడల్‌ను బిశ్వజిత్ బహుకరించారు. నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ విఎస్‌సి రావు (సివిల్ మిలటరీ లైజన్ (అడ్వైజరీ), కెప్టెన్ అభిషేక్ కుమార్, లెఫ్టినెంట్ పీఎస్. చౌహాన్ కూడా సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.