జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం సమాజంలో కనబడడం లేదని టిడిపి సీనియర్ నేత, ఆర్ధిక శాఖా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దీనివల్ల ఓ వైపు అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమం కూడా సరిగా సాగడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తెస్తోన్న అప్పులన్నీ వారి స్వార్ధం కోసం వాడుకుంటున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. చేసిన అప్పులు దుర్వినియోగం చేసినట్లు అర్ధమవుతోందని అన్నారు.
కాగ్ కు సరైన లెక్కలు సమర్పించడం లేదని, దీని వెనుక ఉన్న కారణాలేంటో చెపాలని యనమల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం అడుగుతుంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో, బైటా అసత్యాలు మాట్లాడుతున్నారని.. తాము చేసిన తప్పులు, అప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏవేవో మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులో ముంచెత్తుతున్నారని, దీనివల్ల రాష్ట్ర భవిష్యత్ దెబ్బతింటోందని, రాబోయే కాలంలో కూడా యువతకు సరైన భవిష్యత్ లేకుండా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.
రానున్న తరాలకూ సీఎం జగన్ భవిష్యత్ లేకుండా చేస్తున్నారని…తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తెచ్చిన అప్పు స్వార్థానికే జగన్ వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. అర్హతకు మించి చేసిన అప్పులకు లెక్కలు కూడా లేకపోవడమే… నిధుల దుర్వినియోగానికి సాక్ష్యమన్నారు. కాగ్ కు ఎందుకు లెక్కలు చెప్పట్లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు
Also Read : రాష్ట్రం మరో నైజీరియా : యనమల వ్యాఖ్య