టి 20వరల్డ్ కప్ లో ఇండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నేడు జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇండియా విసిరిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో డచ్ జట్టు 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేయగలిగింది.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ మరోసారి విఫలమై 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు అర్ధ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53; విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటి 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేయడం విశేషం, 25 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 51 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు.
డచ్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసేన్, వాన్ మీకెరన్ చెరో వికెట్ సాధించారు.
నెదర్లాండ్స్ 11 పరుగులకే తొలి వికెట్ (విక్రమ్ జీత్ సింగ్) కోల్పోయింది. ఆ కాసేపటికే మరో ఓపెనర్ మాక్స్ ఒదౌద్ (16) కూడా వెనుదిరిగాడు. జట్టులో టిమ్ ప్రింగిల్-20; కోలిన్ అకేర్మేన్-17; షరీజ్ అహ్మద్-16; బాస్ దే లీదె-16; మీకెరన్-14 పరుగులు మాత్రమే చేశారు.
అశ్విన్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ తలా రెండు; మహమ్మద్ షమీ వికెట్ పడగొట్టారు.
సూర్య కుమార్ యాదవ్ కు కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ICC Men’s T20 World Cup 2022: బంగ్లాపై సౌతాఫ్రికా భారీ విజయం